గాంధారి: గర్గుల్ పాఠశాలను ఆకస్మికతనికి, మెనూ ప్రకారం విద్యార్థులకు వేడివేడి ఆహారాన్ని అందించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
మెనూ ప్రకారం ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం 6 సమయంలో జిల్లా కలెక్టర్ గాంధారి మండలంలోని గర్గుల్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటగదిలో మధ్యాహ్నం భోజనం కోసం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఐదో తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా నైపుణ్యాలను పరిశీలించి నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు ఇంకా కురుస్తున్నందున పాఠశాల పరిసరాలు మరియు వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ మెనూ ప్రకారం వండి వేడివేడి ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు.