కావలి: ఏబీవీసీ అభ్యాస వర్గ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.....
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో శనివారం అభ్యాస వర్గ కార్యక్రమం జరిగింది. శాంతి నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాల (మాస్టర్ స్కూల్ క్యాంపస్) లో జరిగిన ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.