నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకార్చనలు చేశారు. ఆలయంతో పాటు వినాయక నంది, గరుడనందిలో భక్తులు పూజలు నిర్వహించారు. క్షేత్ర పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.