అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని తపోవనం సర్కిల్ లో ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం నగరంలోని తపోవనం సర్కిల్ లో ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో నగరానికి చెందిన రాజేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం పాలు తీసుకుని నగరంలో ఇళ్లకు వేసేందుకు వస్తుండగా ఒక్కసారిగా వేగంగా దూసుకు వచ్చిన ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.