సింగరాయకొండ మండలం పైడిపాడులోని పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. మంత్రి స్వామి,దామచర్ల సత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిసిటీ పిచ్చితో జగన్ పాసు పుస్తకాలపై తమ బొమ్మ వేసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేశారని మంత్రి స్వామి ఆరోపించారు. రైతు సంక్షేమమే ద్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.