మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం మండలాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మదనపల్లి పట్టణంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఎమ్మెల్యే నివాసం వద్ద పెద్ద ఎత్తున అధికారులు అనధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో ఆయన సుమారు 30 కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం సంబేపల్లిలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరై తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.