పాలకొల్లు: కాపు సంక్షేమ సేనకు మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య రాజీనామా
కాపు సంక్షేమ సేనకు మాజీ ఎంపీ చేగొండి హరరామ జోగయ్య రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం కాపులతో ఉద్యమించడం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకున్నామని, అందుకే 'రాష్ట్రీయ జన సంక్షేమ శాఖ' అనే కొత్త సంస్థను అన్ని కులాల వారితో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు ఈ సంస్థ సహాయం చేస్తుందని తెలిపారు.