ఒంగోలు అర్బన్: త్యాగం,ప్రేమ సత్యానికి ప్రతీకగా నిలిసే బక్రీదు పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 27, 2026
మానవ జీవితంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, దేవునిపై విశ్వాసాన్ని కలిగి సన్మార్గంలో నడవాలని బోధించే పవిత్రమైన పండుగ బక్రీద్ అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. తమకు ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు పంచిపెట్టే దాతృత్వ భావనను పెంపొందిస్తూ, త్యాగం, ప్రేమ, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. బక్రీద్ పండుగ వేడుకలు, కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు.