వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన వైసీపీ పార్టీ శ్రేణులు. వైయస్సార్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎడం బాలాజీ, వైసిపి పార్టీ శ్రేణులతో పర్చూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్చూరు బొమ్మల సెంటర్ నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి ముఖ్య నాయకులతో కేక్ కట్ చేసి పార్టీ నాయకులతో పంచుకొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి బాలాజీ మాట్లాడుతూ..