పలమనేరు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ జిల్లా యంత్రాంగం ప్రజలకు ముఖ్య సూచన చేశారు
పలమనేరు: ముసలిమడుగు ఎలిఫెంట్ హబ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డీఎఫ్ఓ మరియు జిల్లా యంత్రాంగం అటవీ రెవెన్యూ ఉన్నతాధికారులు ఏర్పాట్లును పరిశీలించారు. డి ఎఫ్ ఓ సుబ్బరాజు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ముసలిమడుగు సమీపంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు.అనంతరం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతారు.వీరి ఆధ్వర్యంలో ఎలిఫెంట్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. పాసులు ఉన్న వారు మాత్రమే లోపలికి రావాలి, ప్రజలు ఎవరూ రావద్దని కోరారు.