డోన్: ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 28, 2026 నంద్యాల జిల్లా డోన్ తారక్ రామ్ నగర్ లో ఎన్టీఆర్ 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.