డోన్: డోన్,ప్యాపిలి కి గోరుకలు నీరు.. ట్రయల్ రన్ పరిశీలించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jul 8, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం యు.కొత్తపల్లి సమీపంలో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి వాటర్ గ్రిడ్ పైప్లైన్ ద్వారా డోన్, ప్యాపిలి మండలాలకు తాగునీటి సరఫరా కోసం నిర్వహిస్తున్న ట్రయల్ రన్ను MLA కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి నీటి సరఫరా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకంతో రెండు మండలాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు