డోన్ లో అక్రమ పశు రవాణాను అడ్డుకున్న బిజెపి నాయకులు
Dhone, Nandyal | Apr 1, 2026 నంద్యాల జిల్లా డోన్లో అక్రమ పశు రవాణా వ్యవహారం మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గుత్తి రోడ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణను కేంద్రంగా చేసుకుని ప్రతి మంగళవారం రాత్రి పశువులను కంటైనర్లలో గుట్టుగా తరలిస్తున్న ముఠాను బీజేపీ నాయకులు పట్టుకున్నారు. హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని కబేళాలకు పంపిస్తున్నారని, దీని వెనుక కొంతమంది అధికారుల సహకారం కూడా ఉందనీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు