పుంగనూరు: 22 నుంచి శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు.
ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి .
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం కోనేటి వద్ద గలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జరుగునున్నాయని ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఓ ప్రకటనలు తెలిపారు. ఈనెల 28వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తాదులు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మ వార్ల అనుగ్రహం పొందాలని కోరారు.