గుంతకల్లు: గుత్తి శివారులో జాతీయ రహదారిపై సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు, ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణాలతో మరమ్మతుకు గురై నిలిచిపోయింది. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తున్న డోన్ డిపో బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా శనివారం గుత్తి శివారులో నడి రోడ్డుపై ఆగిపోయింది. డ్రైవర్ సుమారు అరగంట పాటు మరమ్మతులు చేసినా స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు ఇతర వాహనాలు, ఆటోలలో ఎక్కి వెళ్లిపోయారు. అయితే డోన్, కర్నూలుకు వెళ్ళే ప్రయాణికులు ఇతర బస్సు వచ్చేవరకు లగేజ్ తో రోడ్డు పక్కన ఎండలో నిల్చొని ఇబ్బందులు పడ్డారు.