బనగానపల్లె: పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకు రావాలి :మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి
"SAVE TREES - SAVE WATER” 51 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర పూర్తి చేసిన విశాఖపట్నానికి చెందిన యువకుడు కర్రి రాము ఆచార్యకు బనగానపల్లెలో ఘన స్వాగతం లభించింది. నేపాల్, భూటాన్తో పాటు దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించిన ఆయనను బీసీ ఇందిర సత్కరించారు. ఆమెతో కలిసి రాము ఆచార్య మొక్క నాటారు.