ఉరవకొండ: జిల్లా ఉత్తమ స్వచ్ఛ స్కూల్ అవార్డు సాధించిన బెలుగుప్ప కేజీబీవీ
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయ్ కళాశాలకు సోమవారం జిల్లా కేంద్రంలోని హోటల్ అలెగ్జాండర్ లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర 2025 అవార్డుల ప్రధానం కార్యక్రమంలో బెలుగుప్ప కేజీబీవీకి స్వచ్ఛ స్కూల్ అవార్డు వచ్చిందని కేజీబీవీ ఎస్ఓ నాగరత్నబాయి పేర్కొన్నారు. ఉత్తమ స్వచ్ఛ స్కూల్ అవార్డును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ట్రైనీ కలెక్టర్ సచిన్ రహార్, సమగ్ర శిక్ష ఏ పి సి శైలజలతో కలసి స్వచ్ఛ స్కూల్ అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. స్వచ్ఛ అవార్డు తమ గురుతర బాధ్యతలను మరింత పెంచిందని కేజీబీవీఎస్ ఓ గుర్తు చేశారు.