తాళ్లరేవు: సుంకరపాలెం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు మోపూరి శ్రీనివాస్ కిరణ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు
ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం మాజీ సర్పంచి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోపూరి శ్రీనివాస్ కిరణ్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముమ్మిడివరం నియోజవర్గ కూటమి అసెంబ్లీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. మోపూరి శ్రీనివాస్ కిరణ్ కి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.