తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో రైతన్నా – మీకోసం కార్యక్రమం నాల్గవ రోజు గురువారం తడ మండలం, చెనిగుంట గ్రామంలో నిర్వహించారు. ఎమ్మెల్యే నేరుగా గ్రామస్థాయిలోని రైతులతో సమావేశమై, వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, వివిధ వ్యవసాయ సేవలను గురించి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతు సంక్షేమం మా కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. రైతుబంధు, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం. సాగునీరు, ఎరువులు