బనగానపల్లె: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో నిందితులు ఆత్మహత్య...?
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న బెలుం శింగవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై గతంలో 3 కేసులు ఉండగా, మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళనతో బెలుం శింగవరం సమీపంలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. సీఐ రమేశ్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.