నడిగూడెం: రామాపూరంలో కరెంట్ షాక్.. 7 పాడి గేదెల మృతి
నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నలుగురు రైతులకు చెందిన పాడి గేదెలు కరెంట్ షాక్తో మృతిచెందాయి. గ్రామానికి చెందిన నేలమర్రి శ్రీనుకు చెందినవి 2, శంకర్ 1, రామిరెడ్డి 3, తోడేటి శ్రీనుకు చెందిన ఒక గేదె మేతకు వెళ్లి కరెంట్ తీగలు తగిలి చనిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చనిపోయిన గేదెల సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకున్నారు.