సంతనూతలపాడు: ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమీక్ష నిర్వహించిన సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... ఉపాధి హామీ పథకంలో కూలీలు సక్రమంగా హాజరయ్యేలా సిబ్బంది చూడాలన్నారు. కూలీల భాగస్వామ్యం ఉపాధి పనుల్లో పెరిగేలా చూడాలని, కూలీల మాస్టర్లు సక్రమంగా వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.