ఉరవకొండ: రైతులు పంటలు సాగు చేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాఫ్ బుకింగ్ చేపట్టండి : తహసిల్దార్ అనిల్ కుమార్
ప్రస్తుతం రైతులు సాగుచేసిన ప్రతి ఎకరాకు ఈ క్రాఫ్ బుకింగ్ చేపట్టాలని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్ సోమవారం పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి పృథ్వి సాగర్, డిప్యూటీ తహసిల్దార్ మధుసూదన్ రావు గురుబ్రహ్మలతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రాప్ బుకింగ్, పి జి ఆర్ ఎస్, సెక్షన్ 22 ఏ, చుక్కల భూములు, ఆర్డిఓ ఆర్ఓఆర్ కేసులు, రీ సర్వే అంశాలపై సమీక్ష నిర్వహించి వీటిపై అర్జీలను సత్వరమే పరిష్కరించాలని తహసీల్దార్ పేర్కొన్నారు.