అనంతగిరి మండలం రాజుపాక రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన విజయనగరం ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర
అనంతగిరి మండలం రాజుపాక గ్రామానికి అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన రహదారిని తెలుగుదేశం పార్టీ అరకు ఇన్చార్జి, ఏపిఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర మంగళవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా రోడ్డు నాణ్యతపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని రాజీ పడొద్దు అని చెప్పారు.