ఒంగోలు అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
Ongole Urban, Prakasam | Jun 20, 2026
ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయా పోలీస్ స్టేషన్లలో "క్లీన్ అండ్ గ్రీన్" కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ మరియు పోలీస్ కార్యాలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. గుణపం, పారలు ఉపయోగించి పిచ్చి మొక్కలను తొలగించారు. ఇలా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, పర్యావరణ పరిరక్షణకు తమ పాత్రను పోషించారు.