పిచ్చాటూరు : నీరువాయి బీసీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలోని నీరువాయి బీసీ కాలనీలో నివాసం ఉంటున్న రవీంద్ర ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం పూర్తిగా దగ్ధమైంది. ఆస్తి నష్టం కూడా జరిగినట్లు స్థానికులు, కుటుంబీకులు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.