ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల కమిటీ సభ్యులతో సమావేశం
Ongole Urban, Prakasam | Jun 3, 2026
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన కమిటీ హాల్లో వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం పురోగతిపై కీలక సమావేశం నిర్వహించారు. గృహ, పట్టణ వ్యవహారాల స్థాయీ సంఘం ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొని పథకం అమలు తీరును సమీక్షించారు.