బిజినేపల్లి: నంది వడ్డేమాన్ గ్రామంలో వైభవంగా దసరా వేడుకలు - జమ్మి ఆకుల పంపిణీ
బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రచ్చ కట్ట వద్ద శమీ పూజలు నిర్వహించి, గ్రామస్తులు ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.