రాప్తాడులో అన్నాక్యాంటీన్ భవనాన్ని 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం ఐదున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు లో అన్నా క్యాంటీన్ భవనాన్ని సిసి రోడ్డు పనులను టిడిపి నేతలతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడులో 61 లక్షలతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ భవనం 90 శాతం పనులు పూర్తి కావడం జరిగిందని త్వరలోనే అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా రాప్తాడులో 50 లక్షల రూపాయలతో పలు రాప్తాడు పంచాయతీలో పలు కాలనీలో రోడ్లు నిర్మాణం చేపడుతున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.