ఒంగోలు అర్బన్: వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 3, 2026
వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం 60 అడుగుల రోడ్డులో ఉన్న పోతురాజు కాలువను శుభ్రం చేసే పనులను అధికారులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పూడికతీత పనులను పరిశీలించారు. ఘన వ్యర్ధాల నిర్వహణ గురించి ప్రజలకు ఈ సందర్భంగా ఆయన అవగాహన కల్పించారు. ' ఆపరేషన్ క్లీన్ స్వీప్ ' కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య నిర్వహణపై నెలరోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు