ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనను కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ పరిశీలన
ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దుర్ఘటనను కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాదం దురదృష్టకరమని, డ్రైవర్ నిద్ర మత్తులో ఒక్కసారిగా కారును రాంగ్ రూట్లో పోనివ్వడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు.