ఒంగోలు అర్బన్: ఒక రైతులను ఆదుకున్నది ఎప్పుడైనా టిడిపి ప్రభుత్వం మాత్రమే : ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jul 13, 2026
ఒంగోలు నగరంలో సర్ ప్రక్రియ 97.7 పూర్తయిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లను తొలగించి అసలైన ఓటర్లను గుర్తించేందుకే సర్ఫ్ లక్రియను ప్రవేశపెట్టిందని దీన్ని విజయవంతం చేసేందుకు చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని పార్టీల నేతలు కావాలని పొగాకు రైతులు పైన ఏదో ప్రేమ ఉండే విధంగా రైతులను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని వీటిని నమ్మవద్దన్నారు. రైతులను ఆదుకున్న ఘనత టిడిపి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని గుర్తు చేశారు.