అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కొర్రపాడు లో యువకుడిపై అదే గ్రామానికి చెందిన వారు విచక్షణారహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో నవీన్ కృష్ణ అనే యువకుడి పై అదే గ్రామానికి చెందిన పలువురు రాళ్లు కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.