నంద్యాల అర్బన్: నంద్యాలలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి
Nandyal Urban, Nandyal | Jul 5, 2026
నంద్యాల మండలంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ DEO జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పులిమద్ది ప్రాథమిక పాఠశాల టీచర్ కృష్ణారావు ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఆయన స్థానంలో SGT విజయ్ భాస్కర్ పనిచేశారు. 2వ తేదీ 14 మంది పిల్లలకు ఒకరే రావడంతో.. అటెండెన్స్లో 13మందికి అబ్సెంట్ వేశారు. అయితే కృష్ణారావు మిడ్ డే మీల్స్ యాప్లో 14మంది వచ్చినట్లు పేర్కొనడంతో ఈ ఇద్దరిపై వేటు వేశారు.