వేములవాడ: ఉదయం అధిక ఉక్కపోత రాత్రి భారీ వర్షం..వాహనాల రాకపోకలకు ఆటంకం ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజానీకం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం ఉదయం అధికంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.బుధవారం రాత్రి సుమారు 10:30 నిమిషాలకు భారీ వర్షం కురిసింది.దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.పలు వార్డుల్లో డ్రైనేజీలు,సీసీ రోడ్లు సరిగా లేకపోవడంతో రోడ్డుపైకి మురికి నీరు చేరుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షపునీరు అధికంగా రోడ్లపైకి చేరగా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు పేర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. విద్యుత్ వాహకాలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.