రాప్తాడు: అనంతపురంలో ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలతో సమావేశమై 15వ ఆర్థిక సంఘం నిధులు గురించి చర్చించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో మంగళవారం 4:30 గంటల సమయంలో ఆత్మకూరు అనంతపురం రూరల్ రాప్తాడు ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన నేపథ్యంలో కొంతమంది సర్పంచులు ఇష్టానుసారం నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఇలాంటి వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని వాటి ప్రాధాన్యతగాన నిధులు ఖర్చు చేయాలని అందుకు ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.