మైదుకూరు మండలం శెట్టివారిపల్లె, చిన్నయ్యగారి పల్లె ప్రాంతాల్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలుగు నీరు పెద్ద ఎత్తున పొలాల్లోకి చేరడంతో పంటలు నీట మునిగే పరిస్థితి ఏర్పడింది. గడ్డమాలపల్లెలోని జగనన్న కాలనీ సమీప ప్రాంతాలకు కూడా భారీగా నీరు చేరుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.