మంచిర్యాల: చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి గడ్డం వివేకానంద
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం సమీకృత కలెక్టరేట్లో జిల్లా అధికారులు, చెన్నూరు నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ సాగులో భాగంగా యూరియా పంపిణీ ప్రక్రియలో జాగ్రత్త వహించాలని, పట్టాదారులు, కౌలుదారులను గుర్తించి ప్రణాళిక ప్రకారం యూరియా అందించాలని తెలిపారు.