నిజామాబాద్ సౌత్: నగరంలోని TCS మూడవ డిపోలో భవాని గీత పారిశ్రామిక సహకార సంఘంలో స్థానికేతరులకు అవకాశం కల్పిస్తున్నారని కలెక్టర్కు వినతి.
నగరంలోని టిసిఎస్ డిపో 3లో డిపో అధ్యక్షుడు తన గ్రామానికి చెందిన వారిని డిపోలో నియమించుకుని అర్హులైన తమని తీసుకోవడం లేదని బాధితులు తెలిపారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో టిసిఎస్ డిపో 3కి చెందిన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుడు నవీన్ మాట్లాడుతూ భవాని గీత పారిశ్రామిక సహకార మూడవ సంఘంలో సహకార సంఘాల బైలా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా అక్రమంగా స్థానికులకు కాకుండా, స్థానికేతులకు ఇస్తున్నారని వాపోయారు.