నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, బైకును ఢీకొట్టిన లారీ, ఓ యువకుడు దుర్మరణం, మరో యువకునికి తీవ్ర గాయాలు
Nandyal Urban, Nandyal | May 31, 2026
నంద్యాల పట్టణం నూనెపల్లె వంతెనపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో షమీర్ (22) మృతి చెందినట్లు మూడో పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నూనెపల్లెకు చెందిన మహమ్మద్ హుసేన్, ఫరీదా దంపతుల కుమారుడు షమీర్, అతని మిత్రుడు కిరణ్ు మెనానిక్లుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై నూనెపల్లె ఉపరితల వంతెనపై వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో షమీర్ మృతి చెందగా కిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో జీజీహెచ్కు తర లించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.