కర్నూలు: సిపిఎం కార్యకర్త పాపిరెడ్డి మృతి – తీరని లోటు :
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి
సిపిఎం పార్టీకి ఆప్తుడైన ముజఫర్నగర్ కాలనీలోని పార్టీ కార్యకర్త పాపిరెడ్డి మృతి పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ. రామకృష్ణ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనారోగ్యంతో మృతి చెందిన పాపిరెడ్డి మృతదేహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. పాపిరెడ్డి గత 30 ఏళ్లుగా సిపిఎం పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని, అనేక కష్టకాలాల్లో పార్టీకి అండగా నిలిచారని వారు గుర్తుచేశారు.అతని మృతి పార్టీకి, ముజఫర్నగర్ కాలనీకి తీరని లోటని వారు పేర్కొన్నారు. పాపిరెడ్డి కుటుంబ సభ్యులకు సిపిఎం నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.