ఒంగోలు అర్బన్: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రావ్ 40వ వర్ధంతి వేడుకలు
Ongole Urban, Prakasam | Jul 6, 2026
భారత దేశ నిర్మాణంలో అగ్రగామిగా, దళితోద్ధారకులుగా మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు, ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (DD) శ్రీ ఎన్. లక్ష్మా నాయక్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మా నాయక్ మరియు ఇతర ముఖ్య అతిథులు, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సుమారు 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా పని చేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాడు అన్నారు