అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ నందు శుక్రవారం సర్పంచ్ మోనాలిసా,ఎంపీడీవో శివాజీ రెడ్డి,డిప్యూటీ ఎంపీడీవో దామోదర్ రెడ్డిల ఆధ్వర్యంలో గ్రామంలో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు, ఈ స్పెషల్ సానిటేషన్ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి క్లాప్ మిత్రాలు అంతా కలసి గ్రామంలో చెత్త సేకరణ చేశారు. తడి చెత్త పొడి చెత్తలను సేకరించి విధానాలపై అధికారులతో కలిసి క్లాప్ మిత్రలకు సర్పంచ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,క్లాప్ మిత్రాలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు