కోడుమూరు: కే నాగలాపురం సమీపంలో వాహనం బోల్తా ప్రభుత్వ ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం
గూడూరు మండలం కే నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం క్రూజర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో విధులకు వెళ్తున్న ఉపాధ్యాయులకు ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 11 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలిసింది. అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడారు. ప్రమాద ధాటికి వాహనం నుంచి పొగలు వెలువడ్డాయి.