నంద్యాల గోదాముల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం
Nandyal Urban, Nandyal | May 21, 2026
నంద్యాల గోదాముల వద్ద మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైసీపీ భోజన వసతి కల్పించింది. తిండి లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతల కోసం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం నేతలు ద్వారం శ్రీకాంత్ రెడ్డి, సద్దల చంద్రశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు. కష్టకాలంలో రైతాంగానికి అండగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు.