ఒంగోలు అర్బన్: పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 1, 2026
రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర పింఛన్ల దారులకు జూన్ నెలలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. సోమవారం ఒంగోలు నగరంలోని ఏనుగుల చెట్టు వీధి లో మున్సిపల్ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ రాజాబాబు, లబ్దిదారులకు పింఛన్ సొమ్ము అందజేసారు. కలెక్టర్ వెంట ఒంగోలు మున్సిపల్ కమీషనర్ వెంకట క్రిష్ణయ్య, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.