బనగానపల్లె: బనగానపల్లెలో ప్రజాధర్బార్ లో అర్జీలు స్వీకరించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విన్నారు. అర్జీలను స్వీకరించి, న్యాయపరంగా పరిష్కరించే అంశాలపై అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మిగిలిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు