ఒంగోలు అర్బన్: పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
Ongole Urban, Prakasam | Jul 4, 2026
స్వాతంత్య్ర సమరయోధుడు, విప్లవ వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ అధికారులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి, భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను కొనియాడారు. మన్యం ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు