కనిగిరి: ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ ఉపాధ్యాయులతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి విద్యావంతులు కావడం ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఏటా నవంబర్ 11న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, మొట్టమొదటి భారత దేశ విద్యా శాఖ మంత్రి దివంగత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుతుందన్నారు.