నంద్యాల అర్బన్: నంద్యాలలో కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ జవాన్
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
నంద్యాలకు చెందిన మాజీ సైనికుడు సయ్యద్ హుస్సేన్ తన కుమారుడు అహమ్మద్ హుస్సేన్పై పోలీసులను ఫిర్యాదు చేశారు. తమను పోషిస్తానని నమ్మించి రూ.4 లక్షలు, తన భార్య బంగారం తాకట్టు పెట్టుకున్నాడని వాపోయారు. తన పెన్షన్ డబ్బులు కూడా కుమారుడి EMIలకు కట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తినేందుకు తిండి కూడా పెట్టడడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు